కాకా పురాణిక్

ఆధ్యాత్మికం : షిర్డీ సాయి లీలలు

Shirdi Sai baba

సాయి బాబా షిర్డీ గ్రామాన్ని విడిచి (దగ్గరున్న ఒకటి, రెండు గ్రామాలు తప్ప) ఎక్కడకూ పోయినట్టు దాఖలాలు లేవు.. కానీ ఇతర ప్రదేశాల్లో జరిగే సంగతులు ఆయనకు తెలుసును . ఇతర సద్గురువులను గూర్చి కూడా తెలుసు.. తెలియజేయటమే కాదు.. భౌతిక రూపాలు మాత్రమే వేరు అని సాయి తెలియజేస్తారు.. దోపేశ్వర్ లో కాక పురాణిక్ అనే మహనీయుడు ఉండేవాడు.. డాక్టర్ పండిట్ ఆయన భక్తుడు.. పండిట్ ఒకసారి షిర్డీకి వచ్చి సాయి బాబాబుకు త్రిపుంద్ర లేఖలు దిద్ది , కంఠానికి చందనం పూశాడు.. సాయి కి అంతకు ముందు ఎప్పుడూ ఆలా చేయలేదు.. అలా చేయనివ్వటానికి కారణాన్ని దాదా కేల్కర్ అడగ్గా ‘ నేను (పండిట్) బ్రాహ్మణుడను.. బాబా ముసల్మాన్ కదా ఎలా పూజించటం అని సంకోచించకుండా , తన గురువైన కాక (పురాణిక్)గా భావించి పూజించాడు.. అని సాయి చెప్పాడు.

హరి వినాయక్ సాఠె పూనాలో ఉన్నత ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నాడు .. సాఠె , కాక పురాణిక్ ను తన గృహానికి విచ్చేయమని కోరాడు.. తీరుబడి లేలనందువలన రాలేనని సున్నితంగా చెప్పారు కాక పురానికి. సాఠె ఆఫీసుకు వెళ్ళాడు.. వెంటనే కబురు వచ్చింది.. కాక పురాణిక్ నుండి సాఠె కు.. ఆ జేబురు విన్న వెంటనే కాకా పురాణిక్ తన గృహానికి వచ్చేందుకు రవాణా సౌకర్యాన్ని కలగా జేశాడు.. సాఠె గృహానికి చేరాడు.. కాక పురాణిక్ కూడా చెప్పారు కదా… ఇంతలో మనసు మార్చుకుని వచ్చారు… కారణం ఏంటి ? అడిగాడు సాఠె కాక పురాణిక్ ని .. సాఠె ఇంట్లో తగిలించి ఉన్న సాయిబాబా ఫోటోను చూపిస్తూ , కాక పురాణిక్ ‘ నేను మీ ఇంటికి వచ్చి నిన్ను చూసేదాకా మీరు (సాయిబాబా) నన్ను నిలవనీయ లేదు.. ‘ అన్నారు.. కాక పురాణిక్ మాఘ శుద్ధ త్రయోదశి నాడు (ఫిబ్రవరి చివరలో) శరీరాన్ని విడిచారు.. ఆ సద్గురువులను స్మరించి, తరించెదము గాక.

-ఎం.పి. సాయినాధ్ .

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/category/andhra-pradesh/