NBK107 నుండి అదిరిపోయే ఊర మాస్ పిక్ వైరల్

అఖండ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ..ప్రస్తుతం క్రాక్ ఫేమ్ గోపించంద్ మలినేని డైరెక్షన్లో తన 107 వ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన వీడియోస్ , స్టిల్స్ , పోస్టర్స్ సినిమా ఫై అంచనాలు రెట్టింపు చేయగా..తాజాగా షూటింగ్ లోనుండి బాలకృష్ణ , శృతి హాసన్ తాలుకా ఊర మాస్ స్టైల్ ను డైరెక్టర్ గోపీచంద్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ గా మారింది.

ఇక ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా , కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ గా నటిస్తున్నాడు. కోలీవుడ్ విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ , ప్రముఖ మలయాళ నటుడు లాల్ , నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. చంద్రిక రవి స్పెషల్ నంబర్ లో ఆడిపాడనుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.