పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ బిగ్ షాక్..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు జోరు చూపిస్తున్నాయి. అయితే అధికార పార్టీ మాత్రం మిగతా పార్టీల కన్నా ఎక్కువ స్పీడ్ లో ఉంది. అభ్యర్థుల ప్రకటనే కాదు ప్రచారం సైతం అందరికంటే ఎక్కువగా..ముందుగా చేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.

ఇక కాంగ్రెస్ , బిజెపి పార్టీలు 55 , 52 అభ్యర్థులను ప్రకటించి రెండో లిస్ట్ ను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ కి మాత్రం ఖమ్మం అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారింది. ఇక్కడ ప్రధాన నేతలంతా తమ తమ అనుచరులకే టికెట్లు కేటాయించాలని పట్టుబట్టడంతో ప్రకటన ఆలస్యం అవుతుంది. ఇదిలా ఉంటె తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గానికి అధిష్టానం షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు జెడ్పీచైర్మన్ కోరం కనకయ్యకు సీటు ఇవ్వడం కష్టంగానే కనిపిస్తోంది. కోరం కనకయ్య ఇల్లందు అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఇప్పుడు ఆయనకు సీటు కన్ఫామ్‌ అయ్యే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు.

కనకయ్యకు టికెట్ కేటాయించొద్దంటూ మూడు రోజులుగా ఏఐసీసీ ఎదుట ఇల్లందు కాంగ్రెస్ ఆశావాహుల ఆందోళన చేపట్టారు. దాంతో అధిష్టానం పునరాలోచనలో పడిందట. ఇల్లందు టికెట్ రేసులోకి అనూహ్యంగా కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన కూడా ఇల్లందు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. మాజీ మంత్రి బలరాం నాయక్ అభ్యర్థిత్వాన్ని ఏఐసీసీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రెండో విడత జాబితాలో బలరాం నాయక్‌కు ఇల్లందు సీటును కన్ఫామ్ చేసే అవకాశం కనిపిస్తోంది. మరి ఎవరికీ ఫైనల్ గా టికెట్ వస్తుందో చూడాలి.