వైసీపీ పార్లమెంట్ , అసెంబ్లీ సమన్వయ కార్యకర్తలు వీరే

ఏపీ(AP)లో అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల (Parliament and Assembly) సమయం దగ్గరపడుతుండడం తో అధికార పార్టీ వైసీపీ (YCP)..అభ్యర్థుల ఎంపిక తో పాటు ప్రచార కార్యక్రమాలు వంటివి ముమ్మరం చేసే పనిలో పడింది. ఇప్పటీకే పలు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ లను మార్చిన జగన్..తాజాగా 27 మంది తో కూడిన పార్లమెంట్ , అసెంబ్లీ సమన్వయ కార్యకర్తలను (YCP Coordination Workers) ఎంపిక చేసింది. పార్టీ సీనియర్‌ నేత.. మంత్రి బొత్స సత్యనారాయణ ఈ జాబితా ను విడుదల చేసారు. విస్తృత చర్చల తర్వాత పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ తుది జాబితాను రూపకల్పన చేయించినట్లు తెలుస్తోంది. మొత్తం 175కు 175 సీట్లు గెలవాలని పట్టుదలతో ఉన్న వైసీపీ…ఆ మేరకు ప్రయత్నాలు చేస్తుంది. ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు చేస్తుంది. అందుకు కార్యకర్తలంతా సహకరించాలని జగన్ కోరడం జరిగింది.

ఈ క్రమంలో సామాజీక సమీకరణాలే లక్ష్యంగా జాబితా రూపకల్పన జరిగినట్లు స్పష్టమవుతోంది. తాజా జాబితాలో పలువురికి స్థానచలనం జరిగింది. అలాగే.. పలువురు ఎమ్మెల్యేల వారసులకు ఇన్‌ఛార్జిల పోస్టులు దక్కాయి. ఎంపీలకూ అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలను అధినేత జగన్ అప్పగించారు. ఇక 27 మంది ఎవరనేది ఈ కింది లిస్ట్ లో చూడండి.