కాంగ్రెస్ గూటికి చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా

ఏపీలో అధికార పార్టీ వైసీపీ కి షాకుల మీద షాకులు ఇస్తున్నారు నేతలు. ఎన్నికలు సమీపిస్తుండడం తో కూటమిని ఎలా ఎదురుకోవాలని వ్యూహాలు రచిస్తున్న జగన్..సొంత పార్టీలు వరుసగా షాకులు ఇవ్వడం తట్టుకోలేకపోతున్నారు. అధిష్టానంలో ఉన్న పెద్దల ఒత్తిడి తట్టుకోలేక అలానే వారికి తగిన గౌరవం ఇవ్వట్లేదనే ఆవేదనతో, ఎమ్మెల్యేగా ఉన్నా తమకు సరైన గౌరవం ఇవ్వట్లేదని ఇలా అనేక కారణాలతో వరుసపెట్టి నేతలు బై..బై జగన్ అంటూ టీడీపీ , జనసేన , బిజెపి , కాంగ్రెస్ లలో చేరుతున్నారు. ఈరోజు ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పారు.

ఈరోజు ఉదయం గూడూరు ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. తాజాగ మధ్యహ్నం చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా వైసీపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. హైదరాబాద్​లోని లోటస్ పాండ్ నివాసంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో ఎలీజా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్ కూడా వైసీపీ నుంచి కాంగ్రెస్​లోకి చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన వైసీపీ శాసనసభ్యుల సంఖ్య రెండుకు చేరింది.