మరికాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో విడుదల

గత ఎన్నికల్లో నవరత్నాలు పేరుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ..ఈసారి అంతకు మించి సంక్షేమ పథకాలతో అధికారంలోకి రావాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు వైసీపీ తమ మేనిఫెస్టో ను రిలీజ్ చేయబోతుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా మేనిఫెస్టో ఉండబోతుందని, ఈ ఐదేళ్లలో ప్రజలను ఆకట్టుకున్న అన్ని పథకాలను కూడా మేనిఫెస్టోలో ఉంచబోతున్నారు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే నవరత్నాలను అప్ గ్రేడ్ చేసేలా మేనిఫెస్టో ఉండబోతోంది అని అంటున్నారు. అలాగే వీటితో పాటు పారిశ్రామికీకరణ, ఉద్యోగాల కల్పనపై కూడా మేనిఫెస్టోలో ప్రాధాన్యతను ఇచ్చే అవకాశం ఉందని చెపుతున్నారు. మరోపక్క టీడీపీ ఇప్పటికే సూపర్ సిక్స్ తో ప్రజల్లోకి వెళ్తుంది. ఈ హామీలపై ప్రజలు విస్తృతంగా మాట్లాడుకుంటున్నారు. ప్రచారంలో కూడా హామీల గురించి ప్రజలకు వివరిస్తూ వస్తున్నారు కూటమి నేతలు. మరి వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉంటుందో అనేది కాసేపట్లో తెలుస్తుంది.