పవన్ కోసం చిరంజీవి ని ఆపేసారు

టైటిల్ చూసి అదేంటి..ఎక్కడ అనుకుంటున్నారా..? అయితే ఖంగారుపడాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ సినిమాలకు సంబంధించింది. ప్రస్తుతం రీ రిలీజ్ ట్రేడ్ నడుస్తుంది. అగ్ర హీరోల తాలూకా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను రి రిలీజ్ చేస్తూ అభిమానులను సంతోష పెడుతున్నారు. ఇప్పటీకే పలు చిత్రాలు రిలీజ్ అయ్యి..ఆకట్టుకోగా..తాజాగా చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని న్యూ ఇయర్ కానుకగా ఈ నెల 31 న విడుదల చేయాలనీ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ నెల కాకుండా వచ్చే నెల చివరలో విడుదల చేయాలనీ డిసైడ్ అయ్యారు.

విజయ బాపినీడు దర్శకత్వంలో 1991 మే 9న గ్యాంగ్ లీడర్ చిత్రం విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాదు చిరు కెరియర్ లో ఓ మైలు రాయి చిత్రంగా నిలిచింది. ఈ మూవీ లో చిరంజీవి, విజయశాంతి జంటగా నటించగా..మురళి మోహన్ , రావు గోపాలరావు , కైకాల , అల్లు రామలింగయ్య, నిర్మలమ్మ, ఆనందరాజ్, మాగంటి మురళీమోహన్, శరత్ కుమార్ , సుమలత,
సుధ, నారాయణ రావు, హరి ప్రసాద్ ఇతర పాత్రల్లో నటించారు.

కాగా ఈ చిత్రాన్ని ఈ నెల 31 న రీ రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత నట్టికుమార్ గతంలో ప్రకటించారు. అయితే అదే రోజు పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమాను రిలీజ్ చేస్తుండంతో.. మెగా హీరోల సినిమాలను ఒకేసారి పోటీగా విడుదల చేయకూడదని ఇప్పుడు గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని వచ్చే నెల చివరలో విడుదల చేసేందుకు డిసైడ్ అయ్యారు.