మాజీ ఎంపీ మందా జగన్నాథం నామినేషన్ తిరస్కరణ

తెలంగాణ లోక్ సభ ఎన్నికల నామినేషన్ల పర్వం నిన్నటితో పూర్తి కావడం తో..ఈరోజు నామినేషన్ దాఖలు చేసిన దరఖాస్తుల పరిశీలన మొదలైంది. ఈ క్రమంలో పలువురి నామినేషన్లకు ఆమోదముద్ర పడగా..మరికొంతమంది నామినేషన్ల ను తిరస్కరించారు.

తిరస్కరింప బడిన వారిలో మాజీ ఎంపీ మందా జగన్నాథం నామినేషన్ కూడా ఉండడం అందర్నీ షాక్ లో పడేసింది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా నామినేషన్ వేశారు. జగన్నాథం బీఎస్పీ తరఫున నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే, ఆయన బీఫామ్‌ ఇవ్వకపోవడంతో నామినేషన్‌ తిరస్కరణకు గురైనట్లు అధికారులు తెలిపారు.