పరీక్షలు లేకుండానే పై తరగతులకు

తెలంగాణలో 1 నుంచి 9వ తరగతి వరకు పరీక్షల్లేకుండానే పై తరగతులకు..అన్ని పాఠశాలలకు వర్తిస్తుందంటూ ఉత్తర్వులు

school-students

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యా సంవత్సరం ముగియకుండానే రాష్ట్రంలోని పాఠశాలలు మూతపడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షల్లేకుండానే విద్యార్థులను పై క్లాసులకు ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇది ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలన్నింటికి వర్తిస్తుందని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించి 1 నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలు ఉండవని స్పష్టం చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/