మరోసారి పవన్ కళ్యాణ్ ఫై విరుచుకుపడ్డ వైస్సార్సీపీ నేతలు

మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై వైస్సార్సీపీ నేతలు మాటలతో విరుచుకపడ్డారు. వైస్సార్సీపీ ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలోని కొంతమంది ఇళ్లను కూల్చేసిన సంగతి తెలిసిందే. జనసేన మీటింగ్ కు ఇప్పటం గ్రామస్థులు స్థలం ఇచ్చారనే కోపంతోనే వారి ఇళ్లను కూల్చేశారని జనసేన ఆరోపిస్తూ..ఇల్లు కోల్పోయిన వారికీ లక్ష రూపాయిలు ఇస్తున్నట్లు ప్రకటించిన పవన్..ఈరోజు వారికీ చెక్కులు అందజేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..వైస్సార్సీపీ ఫై నిప్పులు చెరిగారు. నాకు అండగా ఉన్న ఇప్పటం ప్రజలకు నేను అండగా ఉంటానని ప్రకటించారు. నష్ట పరిహారం ఇవ్వకుండా ఇళ్లు కూలగొట్టడం బాధ కలిగించిందన్నారు. వైస్సార్సీపీ గడప కూల్చేదాకా వదిలిపెట్టమని హెచ్చరించారు. ఇక పవన్ కామెంట్స్ ఫై వైస్సార్సీపీ నేతలు వరుసపెట్టి పవన్ ఫై ఫైర్ అవుతున్నారు. మంత్రి అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ” ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడినట్లు పవన్ కళ్యాణ్ వైఖరి ఉందంటూ చురకలంటించారు.

పిట్ట కొంచెం.. కూత ఘనంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఇప్పటంలో గ్రామం అభివృద్ధి కోసం రోడ్లు విస్తరిస్తూ ఉంటే ఆయనకు అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీలో ఏం చేశారో చూసామని, ఇప్పుడు కొత్తగా పవన్ ఏం చేయగలరని మంత్రి బొత్స ఎద్దేవా చేసారు.

రాష్ట్రంలో అన్ని పార్టీలు కలిసి వచ్చిన వైస్సార్సీపీ కంచుకోటను ఇంచు కూడా కదిలించలేరని మంత్రి జోగి రమేష్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ అజ్ఞాని అని , జనసేన ను సైకోసేనగా అభివర్ణించారు. ఈ సైకో గాళ్లు నెలకొకసారి వచ్చి ప్రజలను రెచ్చగొట్టి వెళుతుంటారని అన్నారు.