‘లవ్ యు మామయ్య’ అంటూ కృష్ణ ను తలచుకుంటూ నమ్రత ఎమోషనల్ పోస్ట్

సూపర్ స్టార్ కృష్ణ ను తలుచుకుంటూ మహేష్ బాబు వైఫ్ నమ్రత ఎమోషల్ పోస్ట్ చేసింది. ఈ ఏడాది మహేష్ బాబు కు తీరని లోటును మిగిల్చిన సంగతి తెలిసిందే. వరుస విషాదాలు ఆయన్ను కుంగదీసాయి. జనవరి లో అన్న రమేష్ బాబు కన్నుమూయడం , సెప్టెంబర్ లో తల్లి ఇందిరా దేవి , నవంబర్ లో తండ్రి కృష్ణ మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఎవరికీ కూడా ఇలాంటి తీరని లోటు రాకూడదని అనుకుంటున్నారు.

ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ దశదిన కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్య క్రమానికి కృష్ణ కుటుంబ సభ్యులు, సినీ , రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. దశదిన కార్యక్రమం సందర్భంగా భారీ భోజన ఏర్పాట్లు చేశారు. సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఎన్ కన్వెన్షన్ లో, అభిమానుల కోసం జేఆర్సీ కన్వెన్షన్ లో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్ బాబు మాట్లాడుతూ.. “మా నాన్న గారు నాకు ఎన్నో ఇచ్చారు… ఆయన ఇచ్చిన వాటిలో అన్నింటికన్నా గొప్పది… మీ అభిమానం. అందుకు ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నాన్న గారు ఎప్పటికీ నా హృదయంలో, మీ హృదయాల్లో నిలిచే ఉంటారు. ఆయన ఎప్పటికీ మన మధ్యే ఉంటారు. అభిమానుల్ని కలుసుకోవడం ఆనందం కలిగిస్తోంది. నాపై మీ అభిమానం, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటాను” అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు.

ఈ క్రమంలోని ఇప్పుడు నమ్రత కూడా మహేష్ బాబు లాగానే స్పందించింది. ఆమె తన పోస్టు ద్వారా తన మామ గారి పాత ఫోటో ల వీడియో ను షేర్ చేస్తూ ఇలా రాసుకుంది. “ఎప్పటికీ నిలిచిపోయే సూపర్ స్టార్ .. ఎన్నింటికో పునాది వేసి నిజమైన ట్రెండ్ సెట్టర్గా నిలిచారు.. ఆయనకు సినిమా పట్ల ఉన్న పిచ్చి, ప్యాషన్, ప్రేమ వల్లే సూపర్ స్టార్ అయ్యారు. ఆయన ఎప్పటికీ సూపర్ స్టారే.. నాకు ఆయన తెలియడం.. ఆయనను మామగారు అని పిలవడం .. నా అదృష్టం.. జీవిత పాఠాలు ఎన్నో ఆయన దగ్గర నేర్చుకున్నాను .అవన్నీ ఎప్పుడు పాటిస్తూనే ఉంటాము. ఆయన ఖ్యాతిని ఎప్పటికీ మేం పండుగలా జరుపుకుంటేనే ఉంటాము.. లవ్ యు మామయ్య గారు ” అని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

https://www.instagram.com/reel/Clc9-O9ACDy/?utm_source=ig_web_copy_link