దారుణ హత్యకు గురైన వైసీపీ నేత

ఏపీలో రోజు రోజుకు ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకున్నాయి. మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం..ఇప్పుడు హత్యలతో హడలిపోతుంది. తాజాగా అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం శ్రీవారి నగర్లో వైసీపీ నాయకుడు పుంగనూరు శేషాద్రి దారుణ హత్యకు గురైయ్యాడు. అర్థరాత్రి ఇంట్లో ప్రవేశించిన దుండగులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. భార్య ముందే భర్తను అతి దారుణంగా, కిరాతకంగా నరికి చంపేశారు.

హత్య విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మదనపల్లె డీఎస్పీ ప్రసాద్‌ రెడ్డి, సీఐ వల్లి భాష, యువరాజు, శేఖర్‌ లు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొరకు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి అధికారులు తరలించారు. కేసు నమోదు చేసుకుని,దర్యాప్తు చేస్తున్నట్లు మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ హత్య తో మదనపల్లె హడలిపోయింది.