మీడియా ముందుకు బాలకృష్ణ..వైసీపీ తీరు ఫై ఆగ్రహం

శుక్రవారం ఏపీ అసెంబ్లీ లో చంద్రబాబు కు జరిగిన అవమానం ఫై రెండు తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకుంటున్నారు. ఇంట్లో ఉన్న భార్య ఫై అనుచిత వ్యాఖ్యలు చేసారని చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటన ఫై ఇప్పటికే పలువురు స్పందించగా..శనివారం నందమూరి కుటుంబం
మీడియా ముందుకు వచ్చి వైసీపీ ఫై ఆగ్రహం వ్యక్తం చేసింది.

బాలకృష్ణ మాట్లాడుతూ..మా ఆడ‌వాళ్ల జోలికి వ‌స్తే దేనికైతే అది..ప‌ర్స‌న‌ల్ గా టార్గెట్ చేస్తే ఊరుకోమని అన్నారు. ఇష్యూల‌ను డైవ‌ర్ట్ చేయ‌డం కోసం ఏది ప‌డితే అది మాట్లాడ‌కూడ‌ద‌ని.. ఇష్యూల‌పై మాట్లాడాల‌ని వ్య‌క్తిగ‌తంగా వెల్ల‌కూడ‌ద‌ని అన్నారు. వైసీపీ వాళ్లు మాట్లాడే భాష చాలా దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ధైర్యంగా ఉండే చంద్ర‌బాబు క‌న్నీళ్లు పెట్టుకోవాల్సి వ‌చ్చింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు.

అసెంబ్లీ లో సవాళ్లు, ప్రతిసవాళ్లు ఆనవాయితే..ప్రజాసమస్యలపై పోరాడటమే అసెంబ్లీ వేదికగా ఉండేది. అభివృద్ధిపై చర్చకు బదులు వ్యక్తిగత అజెండా తీసుకొచ్చారు. వైకాపా నుంచి మహిళా శాసనసభ్యులు సభలో ఉన్నారు. అసలు మనం అసెంబ్లీలో ఉన్నామో… పశువుల కొంపలో ఉన్నామో అర్థం కావడం లేదు. అందరి కుటుంబాల్లో ఆడవాళ్లు ఉన్నారు… హేళన చేయవద్దు అని బాలకృష్ణ అన్నారు.