కెజిఎఫ్ హీరో చేతికి పెప్సీ

ప్రముఖ శీతల పానీయం సంస్థ పెప్సీ కి బ్రాండ్ అంబాసిడర్ గా కెజిఎఫ్ స్టార్ యష్ వ్యవహిస్తున్నాడు. కెజిఎఫ్ తో దేశ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న యాష్..ఈ మూవీ తర్వాత తన పాపులార్టీ భారీగా పెరిగింది. దీంతో పలు సంస్థలు ఈయన్ను తమ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ చేసుకుంటూ తమ ఉత్పత్తుల సేల్ ను పెంచుకుంటున్నారు. ఇప్పటికే పలు వాటికీ యాష్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యహరిస్తుండగా ..తాజాగా ప్రముఖ శీతల పానీయాల బ్రాండ్ పెప్సీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నికైనట్లుగా అప్‌డేట్ ఇచ్చాడు.

ఈ మేరకు 10 సెకన్ల కంటే తక్కువ నిడివి గల వీడియోను ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశాడు. ఇక వీడియోలో ముందుగా పెప్సీ సిప్ చేసిన యష్.. ‘కంగ్రాట్యులేషన్స్ పెప్సీ! ఐ లవ్ యూ’ అంటూ కిస్ చేయడం కనిపించింది. కాగా ఈ బేవరేజ్ కంపెనీ త్వరలోనే యష్ నటించిన అడ్వర్‌టైజ్మెంట్‌ను విడుదల చేయనుంది. గతంలో పెప్సీ బ్రాండ్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అలాగే మెగాస్టార్ చిరంజీవి కోకాకోలా బ్రాండ్ శీతల పానీయం ‘థమ్సప్’ ప్రకటనల్లో కనిపించగా.. ప్రస్తుతం యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఆ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.