అఫ్ఘనిస్థాన్‌ అధ్యక్షుడికి ప్రధాని మోడి కృతజ్ఞతలు

కరోనా నిధికి ఆఫ్ఘనిస్థాన్ విరాళం

pm modi
pm modi

న్యూఢిల్లీ: చైనాలోని వూహ్యాన్‌లో పుట్టుకోచ్చిన కరోనా మహమ్మారి దాడికి ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. అయితే ప్రధాని మోడి ఆసియా దేశాలు కరోనాపై ఉమ్మడి పోరాడాలన్న పిలుపునకు సానుకూల స్పందన వస్తోంది. ఈ క్రమంలో కొవిడ్19 ఎమర్జెన్సీ ఫండ్ కు ఆఫ్ఘనిస్థాన్ ఒక మిలియన్ డాలర్ల ఆర్థికసాయం ప్రకటించింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడి హర్షం వ్యక్తం చేశారు. థాంక్యూ ఆఫ్ఘనిస్థాన్ అంటూ స్పందించారు. దక్షిణాసియా దేశాలకు సంఘీభావం ప్రకటిస్తూ భారీ విరాళం ప్రకటించినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను అంటూ ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. అటు, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు గోతబయ రాజపక్సలకు కూడా మోడి ధన్యవాదాలు తెలిపారు. బంగ్లాదేశ్ కొవిడ్19 ఎమర్జెన్సీ ఫండ్ కు 1.5 మిలియన్ డాలర్లు ప్రకటించగా, శ్రీలంక సార్క్ కొవిడ్19 ఎమర్జెన్సీ ఫండ్ కు 5 మిలియన్ డాలర్ల ఆర్థికసాయం ప్రకటించింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/