యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడికి రికార్డు స్థాయిలో ఆదాయం

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. యాదాద్రి దేవాలయం పునర్నిర్మాణం తర్వాత నుండి భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇక శని , ఆదివారాల్లో భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది.

నిన్న ఆదివారం లక్ష్మీనరసింహస్వామి ని 60 వేల మందికిగా పైగా భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవటంతో రూ.1,16,13,977 ఆదాయం వచ్చిందని దేవస్థాన ఈవో గీతారెడ్డి తెలిపారు. దర్శన టికెట్ల నుంచి రూ.18.90 లక్షలు, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.44.37 లక్షలు, కొండ పైకి వచ్చిన వాహనాల ద్వారా రూ.9.75 లక్షలు, తలనీలాల ద్వారా రూ.1.78 లక్షల ఆదాయం ఖజానాకు చేరాయని ఈవో వెల్లడించారు. ఒక్కరోజే రూ.కోటిపైగా ఆదాయం సమకూరటం ఆలయ చరిత్రలో ఇది రెండోసారి అని తెలిపారు. గత ఆదివారం ఆలయ ఖజానాకు రూ.కోటికు పైగా నిత్యాదాయం సమకూరిందని అన్నారు.