సాయి ధరమ్ తేజ్ ను పరామర్శించిన అల్లు అర్జున్

సాయి ధరమ్ తేజ్ ను పరామర్శించిన అల్లు అర్జున్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గత శుక్రవారం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అపోలో హాస్పటల్ లో చికిత్స తీసుకున్నాడు. రోజు రోజుకు తేజు ఆరోగ్యం కుదటపడుతుండడం తో అంత ఊపిరి పీల్చుకుంటున్నారు. గురువారం అల్లు అర్జున్ సాయి తేజ్ ను పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పుష్ప షూటింగ్ కారణంగా కాకినాడ వెళ్లిన బన్నీ.. సాయి ధరమ్‏ను పరామర్శించడానికి రాలేకపోయారు. షూటింగ్ అనంతరం హైదరాబాద్ వచ్చిన బన్నీ.. వెంటనే తేజ్‏ను పరామర్శించేందుకు అపోలో ఆసుపత్రికి వెళ్లారు.

తేజు ప్రమాదం విషయానికి వస్తే..మాదాపూర్‏లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్ పై నుంచి ఐకియా వైపుగా గచ్చిబౌలి వెళుతోన్న సమయంలో తేజ్‌ ప్రయాణిస్తోన్న స్పోర్ట్స్‌ బైక్‌ స్కిడ్‌ అవ్వడంతో ఒక్కసారిగా కింద పడిపోయారు. దీంతో వెంటనే ఆయనను సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయనను జూబ్లీ హిల్స్‏లోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం సాయి ధరమ్‌ తేజ్‌కు అపోలో ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. షోల్డర్‌ బోన్‌ సర్జరీ చేసిన వైద్యులు ఆయనను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.