ఆగని బాదుడు..ఈరోజు కూడా పెట్రోల్ , డీజిల్ ధర పెరిగింది

ఆగని బాదుడు..ఈరోజు కూడా పెట్రోల్ , డీజిల్ ధర పెరిగింది

పెట్రో మంట ఇప్పట్లో ఆగేలా లేదు. ప్రతి రోజు పెట్రోల్ , డీజిల్ ఫై రూ. 30 పైసలు పెరుగుతూ పోతుంది. ఈరోజు కూడా లీటర్ పెట్రోల్‌ 37 పైసలు, డీజిల్‌ 38 పైసలు పెరిగాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.55కి చేరుకుంది. లీటర్ డీజిల్ ధర రూ.104.70గా ఉంది.

ముంబై లో రూ. 113.12 , కు చేరగా డీజిల్ ధర రూ. 104.00 కు పెరిగింది. కోల్‌ కతా నగరం లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.22 కు చేరగా డీజిల్ ధర రూ. 100.25 కు పెరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 113. 49 కు చేరగా డీజిల్ ధర రూ. 106. 04 కు చేరుకుంది. సెప్టెంబర్ 5 వ తేదీ తర్వాత డీజిల్ ధర రూ. 7.02, పెట్రోల్ ధర రూ. 5.72 మేర పెరిగింది.

మన దేశంలో పెట్రోల్ రేటు అత్యధికంగా రాజస్థాన్‌లోని గంగానగర్‌లో ఉంది. అక్కడ లీటర్ పెట్రోల్ రేటు రూ.119.66గా ఉంది. నిన్నటిలో పోల్చితే ఇవాళ ఏకంగా 1.12 రూపాయలు పెరగడం విశేషం. డీజిల్ కూడా 1.06 పెరిగింది. ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర రూ.110.47గా ఉంది. పెట్రోల్ రేటు రేపు 120ని తాకే అవకాశముంది. రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడం తో ఆ భారం సామాన్యుల ఫై పడుతుంది. కూరగాయల ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. దీంతో కేంద్రం ఫై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గించలేకపోతున్నారని వాపోతున్నారు.