వైసీపీకి భారీ షాక్..జనసేన లోకి కీలక నేతలు

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ..ఇప్పటి నుండే వలసల పర్వం మొదలైంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన వైసీపీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరారు. హైదరాబాద్ జనసేన కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాంపుల్లారెడ్డి ఫై పార్టీ కండువా కప్పి.. జనసేనలోకి సాధరంగా ఆహ్వానించారు.

ఇక రాంపుల్లారెడ్డితో పాటు తన అనుచరులు రామచంద్రారెడ్డి, నారాయణ రెడ్డి, విశ్వనాథరెడ్డి, ప్రతాపరెడ్డి, సుధాకర్ రెడ్డి, ప్రసాదరెడ్డి సైతం జనసేనలో చేరారు. అనంతరం ఆళ్లగడ్డలో జనసేన పరిస్థితులను పవన్ కల్యాణ్‌కు వివరించారు. సైద్ధాంతిక బలంతో పవన్ కల్యాణ్ చేస్తున్ పోరాటాలు తమను ఆకర్షించాయని ఇరిగెల రాంపుల్లారెడ్డి పేర్కొన్నారు.