ఈరోజు నుండి యాదాద్రి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తెలంగాణలో ప్రముఖ క్షేత్రం శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ఆలయం యాదాద్రి క్షేత్రంలో నేటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుండి 11 రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ వేడుకలు జరుగనున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే ఉత్సవాలకు, వచ్చే భక్తులకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆలయ ఇఒ రామకృష్ణారావు తెలిపారు. మొదటి రోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు.
ఈ నెల 17న స్వామివారి ఎదుర్కోలు, 18న స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం, 19న స్వామివారి దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు, స్వస్తి పుణ్యహవాచనంతో శాస్త్రోక్తంగా ఆరంభమై, ఈ నెల 21వ తేదీ అష్టోత్తర శతఘటాభిషేక పూజలతో ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.
పూర్తి వివరాలు..
- మార్చి 11వ తేదీ ఉదయం 1వ తేదీ ఉదయం విశ్వక్సేన ఆరాధన, స్వస్తీ వాచనం, రక్షాబంధనం
- 12న ఉదయం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, సాయంత్రం భేరీపూజ
- 13న అలంకార, వాహన సేవలు ప్రారంభం. ఉదయం మత్స్య అలంకారం
- 14న ఉదయం వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి హంస వాహన సేవ
- 15న ఉదయం శ్రీకృష్ణ అలంకారం, రాత్రి పొన్న వాహన సేవ
- 21న ఉదయం నిర్వహించనున్న అష్టోత్తర శతఘటాభిషేకం
శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం