సీఎం కెసిఆర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు : జగ్గారెడ్డి

jaggareddy

హైదరాబాద్: ఈరోజు ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో మాట్లాడిన విషయంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యక్తిగంతగా హర్షం వ్యక్తం చేసారు. సీఎం కెసిఆర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసారు. అయితే గత 7 సంవత్సరాలుగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వట్లేదని అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ తరుపున విమర్శించామని.. యూత్ కాంగ్రెస్ , ఎన్ఎస్ యూ ఐ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామన్నారు. ఈరోజు రాష్ట్రంలో మంచి పనులు జరుగుతున్నాయంటే అందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ , రాహుల్ గాంధీలే కారణం అని చెప్పుకొచ్చారు.

అలాగే హోసింగ్ డిపార్టుమెంట్ ను రీఓపెన్ చేయమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లులు కట్టిన విధంగానే ఇప్పుడు ఇల్లు కట్టుకునే వారికీ రూ . 3 లక్షలు సాయం చేయాలని ప్రభుత్వం చేప్పినా విషయాన్ని కూడా చెప్పారు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం త్వరలోనే మిగిలిన ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అప్పట్లో కెసిఆర్ చేసిన ఉద్యోగాల భర్తీ ప్రకటనకు తీవ్రమైన నిరాశకు గురి అయ్యారు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

తాజా ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/