సీరం సిఇఓ అదర్ పూనావాలాకు వై-కేటగిరీ భద్రత
కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ

New Delhi: కరోనా వ్యాక్సిన్ ‘కొవిషీల్డ్’ తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఇఓ అదర్ పూనావాలాకు భద్రత పెంచుతూ కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పూనావాలాకు దేశమంతటా సీఆర్పీఎఫ్ ద్వారా వై కేటగిరీ భద్రత కల్పిస్తామని తెలిపింది. కరోనా వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించి పూనావాలాకు బెదిరింపులు వస్తున్నందున భద్రత పెంచినట్టు ప్రకటించింది. ఆయనకు రక్షణగా నిరంతరం ఇద్దరు కమాండోలు సహా మొత్తం 11 మంది భద్రతా సిబ్బంది ఉండనున్నారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/