బాలయ్య సినిమాకు బడ్జెట్ అంతా?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ ముగించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా బాలయ్యతో బోయపాటి గతంలో సింహా, లెజెండ్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించడంతో, అఖండ కూడా ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

ఇక అఖండ చిత్రంలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే పేర్కొంది. కాగా ఈ సినిమాలో బాలయ్య పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాను నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు అనుకున్నదానికంటే కూడా ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు రూ.60 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ బడ్జెట్‌లో బాలయ్య రెమ్యునరేషన్ కూడా సాధారణంగా ఉండటం గమనార్హం.

ఈ సినిమా కథనం విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని చిత్ర నిర్మాత ఇలా భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అఖండ చిత్రానికి అదిరిపోయే విజయాన్ని అందించేందుకు ఈ సినిమాను బడ్జెట్ పరంగా ఏమాత్రం తగ్గకుండా చూస్తున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల భామ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.