RRR కు నిర్మాత నట్టికుమార్ ఛాలెంజ్..

సినీ నిర్మాత నట్టికుమార్..ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు ఛాలెంజ్ విసిరారు. జగన్ సర్కార్ ఫై , జగన్ మోహన్ రెడ్డి ఫై నిత్యం విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచే రఘురామ..తాజాగా సినిమా టికెట్స్ విషయంలో జగన్ తీరు ఫై మండిపడ్డారు. జగన్ చడ్డీలు వేసుకున్న నాటి టిక్కెట్ రేట్లను, ఇప్పుడు కొనసాగిస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే రఘురామ కామెంట్స్ ఫై నట్టికుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు. చిత్రసీమ సమస్యలు ఏమితెలుసనీ మాట్లాడుతున్నారని నట్టి కుమార్ ఫైర్ అయ్యారు.

జీవో 35కు విరుద్ధంగా టికెట్ల రేట్లు 200, 300 రూపాయలు ఉండాలంటూ రఘురామ సపోర్ట్ చేస్తున్నారని, ఇది ప్రేక్షకులకు ఎంత మాత్రం ఇష్టంలేదని అన్నారు. టిక్కెట్ రేట్లపై చర్చిద్దామని, ఓడిపోతే పాలాభిషేకం చేస్తానని రఘురామకు సవాల్ విసిరారు. ఆయన పార్లమెంట్ నియోజకవర్గమైన నర్సాపురంలోనే బహిరంగంగా ప్రజల మధ్యన టిక్కెట్ల రేట్ల విషయంలో చర్చ పెడదాం. ఎవరు కరెక్టో తేల్చుకునేందుకు నాతో కలిసి వస్తారా! నా ఛాలెంజ్ స్వీకరిస్తారా? రఘురామ కృష్ణంరాజు ప్రజాకోర్టులో ఓడిపోతే తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలి. ఒకవేళ నేను ఓడిపోతే ఆయనకు ప్రజా సమక్షంలో పాలాభిషేకం చేస్తాను అని అన్నారు.