బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాసలీలలు వైరల్

తెలంగాణ లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతుండగా..తాజాగా బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాసలీలలు సోషల్ మీడియా లో వైరల్ గా మారడం పార్టీ ని విమర్శలకు దారితీస్తుంది. వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ ఓ మహిళతో ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి.

మదన్ లాల్ రాసలీలలు అంటూ సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. వైరా బీఆర్‌ఎస్‌ టికెట్ మదన్ లాల్ కే వస్తుందని తట్టుకోలేక ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గం ఇటువంటి ఫోటో మార్ఫింగ్ చేస్తున్నారని చర్చ జరుగుతోంది. మరోపక్క సోమవారం బిఆర్ఎస్ అధిష్టానం ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించనుంది. మొత్తం 90 మంది అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం.