హిమాన్షు ను తలుచుకుంటూ మంత్రి కేటీఆర్ ఎమోషనల్

మంత్రి కేటీఆర్..తన కొడుకు హిమాన్షు అమెరికా వెళ్లడం పట్ల ఎమోషనలకు గురయ్యారు. నిన్న మొన్నటి వరకు కళ్ళముందే అల్లరిగా ఉండే ఈ పిల్లాడు పెరిగి, కాలేజీకి వెళ్లడాన్ని నమ్మలేకపోతున్న. నాలోని కొంత భాగాన్ని అతడు తీసుకెళ్తున్నాడు’ అని ఎమోషనల్ అవుతూ..చిన్నప్పటి ఫొటోస్ షేర్ చేసారు.

తాను కూడా ఫ్యామిలీతో కలిసి వారం పాటు అమెరికాలో ఉంటానని తెలిపారు. మంత్రి కేటీఆర్ శనివారం రాత్రి అమెరికాకు బయల్దేరి వెళ్లారు. పెట్టుబడుల కోసం న్యూయార్క్, చికాగోలో పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల అధిపతులతో సమావేశం అవుతారు. మంత్రితో పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. కేటీఆర్ వెంట ఆయన భార్య, కుమారుడు హిమాన్షు వెళ్లారు. పర్యటన చివర్లో హిమాన్షును అమెరికా యూనివర్సిటీలో డిగ్రీ కోర్సులో చేర్పించనున్నారు.