అయోధ్య‌లోని రాముడికి పూజ‌లు చేయ‌డం చ‌రిత్రాత్మ‌క‌ం: ఎంపీ స‌త్య‌పాల్ సింగ్‌

Worshiping Ram in Ayodhya is historic.. MP Satyapal Singh

న్యూఢిల్లీ: అయోధ్య‌లో నిర్మించిన రామ మందిరం గురించి ఈరోజు లోక్‌స‌భ‌లో స్వ‌ల్ప కాలిక చ‌ర్చ చేప‌ట్టారు. బిజెపి ఎంపీ స‌త్య‌పాత్ సింగ్ ఆ చ‌ర్చ‌ను ప్రారంభించారు. డీఎంకే నేత‌లు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నా.. రాముడి అంశంపై చ‌ర్చ కొన‌సాగింది. రామ‌క‌థ‌ను చ‌ర్చించ‌డం వ‌ల్ల పార్ల‌మెంట‌రీ నేత‌ల‌కు పుణ్యం వ‌స్తుంద‌ని ఎంపీ స‌త్య‌పాల్ అన్నారు. జ‌న‌వ‌రి 22వ తేదీన జ‌రిగిన ప్రాణ ప్ర‌తిష్ట గురించి మాట్లాడుతూ ఆ కార్య‌క్ర‌మాన్ని వీక్షించ‌డం అదృష్టంగా భావిస్తున్న‌ట్లు చెప్పారు. అయోధ్య‌లోని రామ‌జ‌న్మ‌భూమిలో రాముడికి పూజ‌లు చేయ‌డం చ‌రిత్రాత్మ‌క‌మ‌న్నారు. రాముడు ఎక్క‌డ ఉంటే అక్క‌డ మ‌తం ఉంటుంద‌ని, ధ‌ర్మాన్ని నాశ‌నం చేసిన‌వాళ్లకు మ‌ర‌ణం త‌ప్ప‌ద‌ని, ధ‌ర్మాన్ని కాపాడిన‌వాళ్ల‌కు ర‌క్ష‌ణ ఉంటుంద‌న్నారు. శ్రీరాముడిని కాంగ్రెస్ పార్టీ తిర‌స్క‌రించేందుకు ఆ పార్టీ ఈ ప‌రిస్థితిలో ఉంద‌ని ఎంపీ స‌త్య‌పాల్ తెలిపారు.