జనసేన – టిడిపి ప్రభుత్వం వచ్చాక రోజా అక్రమాలపై విచారణః పృథ్వీరాజ్

actor-prithviraj-sensational-comments-on-roja

అమరావతిః ఎన్నికల్లో పడిపోయే తొలి వికెట్ రోజానే అంటూ వైఎస్‌ఆర్‌సిపి పార్టీపై జనసేన నేత, సినీ నటుడు పృథ్వీరాజ్ కీలక కామెంట్స్ చేశారు. ఏపీలోని శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ఎన్నికల సర్వే చేశానని..అందులో వైఎస్‌ఆర్‌సిపి పార్టీ ఓడిపోతుందని తేలిందన్నారు. టిడిపి – జనసేన కూటమికి 136 అసెంబ్లీ , 21 ఎంపీ స్థానాలు రావడం ఖాయం అని చెప్పారు . సీఎం జగన్ పిసినారి… జేబులో నుంచి పైసా తియ్యడంటూ చురకలు అంటించారు. జనసేన – టిడిపి ప్రభుత్వం వచ్చాక రోజా అక్రమాలపై విచారణ ఉంటుందని తెలిపారు. పవన్ కళ్యాణ్‌ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం , రెండు చోట్ల ఓడిపోవడం వలన పోలవరం నిర్మాణానికి ఏమైనా నష్టం జరిగిందా…అంటూ నిలదీశారు. నా దగ్గర బ్రౌన్ కలర్ లో డైరీ ఉంది ఎమ్మెల్యేలు ఎంత డబ్బు సంపాదించారో నోట్ చేశానని హెచ్చరించారు. జనసేన వెంటనే మెగా ఫాన్స్ ఉంటారని తెలిపారు.