పుష్ప ఫస్ట్ వీక్ కలెక్షన్స్

అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో వచ్చిన పుష్ప 1 బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆర్య , ఆర్య 2 తర్వాత సుక్కు – బన్నీ – దేవి శ్రీ ల కలయికలో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతూ దూసుకెళ్తుంది. గంధపుచెక్కల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా వసూళ్ల పరంగాను రికార్డులు క్రియేట్ చేస్తుంది.

పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో ఊర మాస్ లుక్‏లో అదరగొట్టాడు బన్నీ. ఇక అతని ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న మెప్పించింది. డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇక మొదటివారానికి గాను ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.229 కోట్ల గ్రాస్ సాధించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా దాదాపు 100 కోట్లవరకు వసూల్ చేసిందని తెలుస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ గా కలెక్షన్స్ చూస్తే..

నైజాంలో రూ. 32.78 కోట్లు
సీడెడ్‌లో రూ. 11.19 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ. 5.90 కోట్లు
ఈస్ట్‌లో రూ. 3.93 కోట్లు
వెస్ట్‌లో రూ. 3.26 కోట్లు
గుంటూరులో రూ. 4.24 కోట్లు
కృష్ణాలో రూ. 3.44 కోట్లు
నెల్లూరులో రూ. 2.50 కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ. 67.24 కోట్లు షేర్, రూ. 101.65 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించిన ఈ పుష్ప సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఇందులో మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‏తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ నిర్మించారు.