కరోనా బాధితులకు ప్రపంచ స్థాయి వైద్యం

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడి

TS Ministerr Etala Rajendar
TS Ministerr Etala Rajendar

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా చికిత్సకు అందుబాటులో ఉన్న పద్ధతులను అందిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.

ఇన్ఫెక్షన్‌ డిసీజ్‌లో నైపుణ్యం గల డాక్టర్స్‌తో తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్‌, చికిత్స అందిస్తున్న డాక్టర్స్‌తో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ, కరోనాకు రాష్ట్రమంతా ఒకే వైద్య విధానం ఉండాలని స్పష్టం చేశారు. కరోనా వచ్చిన వారిలో  జబ్బుతో కంటే భయంతో ఎక్కువ మంది చనిపోతున్నారన్నారు.

పాజిటివ్‌ పేషెంట్లలో ధైర్యం నింపాలని సూచించారు. యాంటీ వైరల్‌ మందుల కంటే స్టెరాయిడ్‌ మందులు ఎక్కువ మందికి నయం చేస్తాయన్నారు.

సీటీ స్కాన్‌ వల్ల ప్రయోజనం లేదని,ఎంత తొందరగా చికిత్స మొదలు పెడితే మరణాలను అంత తగ్గించవచ్చని మంత్రి ఈటెల రాజేందర్‌ పేర్కొన్నారు.

అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని ఆసుపత్రుల వైద్యులకు పలు సూచనలు ఇచ్చారు.

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/