రౌడీ కి జోడిగా ధమాకా బ్యూటీ..?

ధమాకా మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శ్రీ లీల ..ఇప్పుడు విజయ్ దేవరకొండ మూవీ లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసినట్లు ఓ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. లైగర్ మూవీ తో భారీ డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ ..ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్లో ఖుషి మూవీ చేస్తున్నాడు. దీంతో పాటు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ఒక స్పై థ్రిల్లర్ సినిమా చేయబోతున్నాడు.

ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది. ఈ క్రమంలో ఈ మూవీ లో హీరోయిన్ గా శ్రీ లీల ను ఎంపిక చేశారనే వార్త ఇప్పుడు అభిమానులను సంబరాలకు గురి చేస్తుంది. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ కోసం ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులను సెలక్ట్ చేస్తున్నారట. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.