దేశరాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన..

దేశరాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కరెంటు స్తంభాన్నితాకి మహిళా మృతి చెందింది. వర్ష కాలం వచ్చిందంటే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కరెంట్ స్థంబాల దగ్గరకు వెళ్లడం.. వాటిని తాకడం అస్సలు చేయకూడదు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ లో వర్షపు నీటితో తడిసిన విద్యుత్ స్తంభాన్ని ప్రమాదవశాత్తూ తాకి ఓ మహిళా టీచర్ మృతి చెందింది.

ప్రియదర్శిని విహార్ ప్రాంతానికి చెందిన సాక్షి అహుజా(34) స్థానికంగా ఓ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త అంకిత్ అహుజా గురుగ్రామ్‌లోని ఓ జపాన్ కంపెనీలో ఇంజినీర్‌గా చేస్తున్నారు. కాగా, ఆదివారం ఉదయం 5.30 గంటలకు సాక్షి చండీగఢ్ వెళ్లేందుకు ఆరుగురు కుటుంబసభ్యులతో కలిసి రైల్వే స్టేషన్ మొదటి గేటు వద్దకు వచ్చారు. రోడ్డుపై నిలిచిన వర్షపు నీరును దాటే క్రమంలో పట్టు తప్పడంతో ఆమె పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని తాకి విద్యుదాఘాతానికి గురయ్యారు. ఒక్కసారిగా ఆమె కుప్పకూలడం తో స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కరెంట్ షాక్ కొట్టడం తో ఆమె మృతి చెందినట్లు డాక్టర్స్ తెలిపారు.