వారాహి యాత్రలో ముద్రగడకు వ్యతిరేకంగా పోస్టర్లు..

వారాహి యాత్రలో ముద్రగడకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలయడం తో వాటిని తొలగించాలని జనసేన శ్రేణులకు సూచించారు పవన్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాలో వారాహి యాత్ర చేస్తున్నారు. గత పది రోజులుగా కొనసాగుతున్న ఈ యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. ఇదే క్రమంలో ముద్రగడ..పవన్ కళ్యాణ్ ఫై పలు ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ముద్రగడ వ్యాఖ్యలకు జనసేన కూడా గట్టిగానే రియాక్ట్ అవుతుంది. ఇక అభిమానులు , జనసేన శ్రేణులు అయితే ఓ రేంజ్ లో ముద్రగడ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో మలికిపురం సభలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. కులద్రోహి అంటూ ముద్రగడకు వ్యతిరేకంగా బ్యానర్లు ప్రదర్శించడంతో పవన్‌ కళ్యాణ్ స్పందించారు. వెంటనే ఆ బ్యానర్లను తీసేయాలని సూచించారు. పెద్దలేదో అంటుంటారు!, మనం తీసుకోవాలి అంతే!, ఇలాంటివి మాత్రం వద్దన్నారు! దాంతో, ముద్రగడకు వ్యతిరేకంగా పెట్టిన ప్లకార్డులు, బ్యానర్లను కార్యకర్తలు తీసేశారు. ఇక వైస్సార్సీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు/. 2024లో వైస్సార్సీపీ గెలిచే ఛాన్సే లేదన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వైస్సార్సీపీ ఒక్క సీటు కూడా గెలవకుండా చేస్తానని శపథం చేశారు. జనసేన అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెప్పుకొచ్చారు. విద్య, వైద్యం, ఉపాధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు.