చివరి శ్వాస దాకా కేసీఆర్ తోనే – దాసోజు శ్రావణ్

బిజెపి పార్టీ కి రాజీనామా చేసి , టిఆర్ఎస్ లో చేరిన దాసోజు శ్రావణ్..ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్బంగా తన చివరి శ్వాస దాకా కేసీఆర్ తోనే ఉంటానని స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నిక హోరు కొనసాగుతుంది. ఈ క్రమంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వలసలు పర్వం కొనసాగుతుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ రెండు నెలల క్రితం బీజేపీలో చేరారు. కాగా ఎంతో కాలం ఆయన బిజెపి లో కొనసాగలేకపోయారు. శుక్రవారం సాయంత్రం టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. శ్రవణ్ తో పాటు స్వామిగౌడ్ సైతం టిఆర్ఎస్ లో చేరారు.

ఇక కేసీఆర్ ను కలిసిన శ్రావణ్..ఉద్యమంలో కేసీఆర్ చేయి పట్టుకొని నడిచానని, ఇకమీదట సీఎం కేసీఆర్ ను వదిలి వెళ్ళబోనని స్పష్టం చేశారు. తన చివరి శ్వాస దాకా కేసీఆర్ తోనే ఉంటానని అన్నారు. తనను మళ్ళీ టీఆర్ఎస్ లోకి వచ్చేలా చేసిన మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞుడినై ఉంటానని, టీఆర్ఎస్ లోకి రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. టిఆర్ఎస్ దేశానికే తలమానికంగా పనిచేస్తుందని, బిజెపిలో మోసపోయిన రాజకీయాలు నడుస్తున్నాయన్నారు.