బావా ఓ చిన్న సాయం చేయవా..అంటూ మంత్రి హరీష్ కు కేటీఆర్ ఫోన్

మంత్రి కేటీఆర్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరు ఏ ఆపదలో ఉన్న సరే పార్టీకి అతీతంగా సాయం చేయడం ఆయన నైజం. అర్ధరాత్రి అయినా సరే..అన్న మీము ఇబ్బంది పడుతున్నాం..ఆపదలో ఉన్నాం ఆదుకోవా అంటే చాలు వెంటనే అధికారులను అప్రమత్తం చేసి ఆ ఆపద నుండి వారిని కాపాడుతుంటారు. ఇలా ఎంతోమందికి ఎంతో సాయం చేసారు. తాజాగా అలాంటి సాయమే మరోసారి చేసి తన గొప్ప మనసు చాటుకున్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మన్నెగూడ లో జరిగిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. సమ్మేళనం ముగిసిన తర్వాత మునుగోడు నియోజకవర్గం గట్టుపల్ కు చెందిన యశోద (27) తన తండ్రితో కలిసి మంత్రి కేటీఆర్ ను కలిశారు. తన కుటుంబ పరిస్థితిని వివరించి , తనకు సహాయం చేయవలసిందిగా కోరింది.

దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ యశోద కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులు ఏమి చేస్తారు. నీకు ఏమి కావాలి? గట్టుపల్ లో జిఎన్ఎం పోస్ట్ ఖాళీగా ఉన్నది.. చండూరు వెళ్లి చేస్తావా? పింఛన్ వస్తున్నదా? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి హరీష్ రావుకు ఫోన్ చేసి బావ ఓ చిన్న సాయం చేయవా అని యశోద గురించి తెలిపి..ఆమెకు ఉద్యోగం ఇవ్వాలని కోరారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కేటీఆర్ సలాం కొడుతున్నారు.