మోడి ప్రభుత్వం నియంతృత్వ వైఖరి అవలంభిస్తుంది

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళ రాష్ట్రం మలప్పురంలోని ఓ సభలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్రమోడి ప్ర‌భుత్వం నియంతృత్వ వైఖ‌రి అవ‌లంభిస్తున్న‌ద‌ని విమ‌ర్శించారు. న్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కేర‌ళ రాష్ట్రం మ‌ల‌ప్పురంలోని ఓ స‌భ‌లో మాట్లాడిన ఆయ‌న.. కేంద్ర స‌ర్కారు న్యాయ‌వ్య‌వ‌స్థపై అజ‌మాయిషీ చేస్తున్న‌ద‌ని, న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను త‌నప‌ని తాను చేసుకోకుండా అడ్డుప‌డుతున్న‌ద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. కేవ‌లం న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను అజ‌మాయిషీ చేయ‌డం మాత్ర‌మే కాద‌ని.. లోక్‌స‌భ, రాజ్య‌స‌భ లాంటి చ‌ట్ట‌స‌భ‌ల్లో కూడా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌కు అనుమంతించ‌డ‌లేద‌ని రాహుల్‌గాంధీ దుయ్య‌బ‌ట్టారు.

అంతేగాక‌, ప‌లు రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌భుత్వాలను కూల‌దోసి బిజెపి త‌న సొంత ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేస్తున్న‌ద‌ని రాహుల్ ఆరోపించారు. రాష్ట్రాల్లో బిజెపియేతర ప్ర‌భుత్వాల కూల్చివేతకు కేంద్రంలోని బిజెపి నిరంత‌రం ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్న‌ద‌ని విమ‌ర్శించారు. బిజెపి తీరుతో ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం అంటే న‌ష్ట‌పోవ‌డం, తారుమారు అయిపోవ‌డం అనేవి అర్థాలు మారాయ‌ని రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/