ఈరోజు నుంచి రెండు రోజులు వైన్‌షాపుల మూసివేత

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు నుండి రెండు రోజుల పాటు రాష్ట్రంలో వైన్ షాప్స్ , బార్స్ మూతపడనున్నాయి. 13వ తేదీ ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో మధ్యం అమ్మకాల పై నిషేధం విధించారు ఎన్నికల అధికారులు. ఈరోజు (మే 11) సాయంత్రం 5 గంటల నుండి 13 వ తేదీ పోలింగ్ ముగిసే వరకు వైన్‌షాప్‌లు మూతపడనున్నాయి.

పోలింగ్ పూర్తిగా ముగిసిన తరువాతే తెరుచుకోనున్నాయి వైన్ షాపులు. కాగా, ఈరోజు ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కానుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు నాల్గో విడతలో 10 రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించనుంది ఈసీ. మొత్తం 10 రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మే 13న పోలింగ్ జరుగనుంది.