కాగజ్‌నగర్‌ పాఠశాలలో షీటీం సేవలపై అవగాహన సదస్సు

కాగజ్ నగర్: కాగజ్‌నగర్‌ మండలం భట్పల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో షీటీం సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ..కాగజ్ నగర్ పరిసర ప్రాంతాల్లోని మహిళలు,విద్యార్థినులు షీటీం సేవలు సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. అత్యవసర సమయాల్లో 100 నెంబర్ కు డయల్ చేయాలని,షీ టీం క్యూఆర్ కోడ్,ఫోన్ హరాస్మెంట్, సైబర్ నేరాలు,బాల్య వివాహాలను అరికట్టడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

గ్రామాల్లో ఈవిటీజింగ్ కు పాల్పడినా,బాల్య వివాహలు చేసినా తమకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. షీటీం సేవలకు సెల్ నెంబర్ 9346987215 లో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సునీత, ఉమెన్ కానిస్టేబుల్ రమాదేవి, ప్రధానోపాధ్యాయులు తూడూరు నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/