వెంకటరెడ్డి కూడా త్వరలో బీజేపీలో చేరుతారా? అనే ప్రశ్నకు రాజగోపాల్ సమాధానం

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బిజెపి లో చేరతారా..? ఈ ప్రశ్న గత కొద్దీ రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ గా నడుస్తుంది. మునుగోడు ఎమ్మెల్యే పదవికి తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన దగ్గరి నుండి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇక మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కూడా కాంగ్రెస్ తరుపున ప్రచారం చేయకుండా ఆస్ట్రేలియా పర్యటన కు వెళ్లడం, తన తమ్ముడికి సహాకరించాలని కాంగ్రెస్ కార్య కర్తలను కోరడం, అంతే కాక మునుగోడు లో ఓడిపోయే కాంగ్రెస్ కు నా ప్రచారం అవసరమా అంటూ కామెంట్స్ చేయడం కాంగ్రెస్ అధిష్టానం సైతం సీరియస్ అయ్యింది. ఫోకాజ్ నోటీసు సైతం జారీ చేసారు. దీంతో వెంకట్ రెడ్డి మీడియాలో కూడా ఎక్కడా కనిపించడం లేదు. మునుగోడు ఉపఎన్నికలో తన తమ్ముడు, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలవ్వడం, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేశారంటూ ఏఐసీసీ తనకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో వెంకటరెడ్డి కొద్దిరోజులుగా సైలెంట్‌గా ఉంటున్నారు. తెలంగాణలో జరిగిన రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రలో కూడా పాల్గొనలేదు.

ఈ తరుణంలో వెంకట్ రెడ్డి కూడా తన సోదరుడు రాజగోపాల్ మాదిరిగానే కాంగ్రెస్ ను వీడి బిజెపి లో చేరుతారనే వార్తలు వైరల్ గా మారాయి. తాజాగా రాజగోపాల్ రెడ్డి ని ఇదే ప్రశ్నించారు. తాజాగా ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటరెడ్డి పార్టీ మార్పుపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. వెంకటరెడ్డి కూడా త్వరలో బీజేపీలో చేరుతారా? అని ప్రశ్నించగా.. సమయం వచ్చినప్పుడు ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటారంటూ రాజగోపాల్ రెడ్డి సమాధానమిచ్చారు. ఆయన ఇంట్లో కూర్చునే మనిషి కాదని, తెలంగాణ కోసం తన మంత్రి పదవిని కూడా త్యాగం చేశారన్నారు. టీఆర్ఎస్ హావాలో కూడా తాము ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచామన్నారు.

రాజగోపాల్ రెడ్డిని అనవసరంగా పోగొట్టుకున్నామని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాధపడుతుందంటూ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడులో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా దక్కలేదని, కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తమలాంటి వారికి పీసీసీ పదవి ఇచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని, టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇవ్వడంపై రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు.