వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన

రాజన్న సిరిసిల్ల: వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా వేముల‌వాడ మున్సిపాలిటీ ప‌రిధిలో నిర్వ‌హించిన ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మున్సిప‌ల్ కార్యాల‌యం వ‌ద్ద హ‌రిత‌హారంలో భాగంగా మొక్క‌లు నాటారు. అనంత‌రం పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టాల్సిన పనులపై అధికారులకు, వార్డు కౌన్సిలర్లకు మంత్రి కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. జులై 1న ప్రారంభ‌మైన ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి 10 రోజుల పాటు కొన‌సాగ‌నుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/