కృష్ణ ఆరోగ్యం ఫై నరేష్ స్పందన

సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆయన్ను హైదరాబాద్ లోని కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్‌లో జాయిన్ చేసిన సంగతి తెలిసందే. ప్రస్తుతం డాక్టర్స్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కృష్ణ హాస్పటల్ లో చేరారని విషయం తెలిసి సినీ ప్రముఖులతో పాటు అభిమానులు కృష్ణ ఆరోగ్యం ఫై ఆరా తీస్తున్నారు. మరోవైపు అభిమానులు సైతం హాస్పటల్ కు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.

కృష్ణ అనారోగ్యంపై సినీ నటుడు నరేశ్ స్పందించారు. శ్వాస సంబంధ సమస్యలతో ఆయనను నిన్న ఆసుపత్రిలో చేర్చామని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. మరో రెండు రోజులు ఆయన హాస్పటల్ లోనే ఉండనున్నారని , కృష్ణ హెల్త్ అప్డేట్ ను డాక్టర్స్ అధికారికంగా తెలియపరుస్తారని తెలిపారు. అభిమానులు ఖంగారు పడవద్దని తెలిపారు.

ఇక కృష్ణ వయసు రీత్యా ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ ఇంట్లోనే ఉంటున్నారు. ఈ మధ్యనే ఆయన భార్య , మహేష్ తల్లి ఇందిరా దేవి కన్నుమూయడం జరిగింది. ఆమె మరణం తరువాత కృష్ణ మరింత కుంగిపోయారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షిణించినట్లు తెలుస్తోంది.