రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం – మంత్రి సబిత

రేపటి నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునః ప్రారంభం కాబోతున్నట్లు మంత్రి సబితా తెలిపారు. ముందుగా అనుకున్నట్లు జూన్ 13వ తేదీ సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. జూన్ 12వ తేదీ ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో క్లాసులు నిర్వహిస్తామన్నారు. ప్రత్యక్ష క్లాసుల ద్వారానే విద్యార్థులకు సబ్జెక్స్ అర్థమవుతాయని.. బ్రిడ్జీ క్లాసెస్ కండక్ట్ చేయాలని తాము టీచర్లకు సూచించడం జరిగిందన్నారు.

పాఠశాలల పునః ప్రారంభం నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాలని పాఠశాలల నిర్వాహకులను ఆదేశించారు. మన ఊరు – మన బడిలో భాగంగా 9వేల పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా.. నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. అలాగే సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టాలని చేపట్టాలని నిర్ణయించారని, ఇందులో భాగంగా ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ మేరకు 1.04లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. బడిబాటలో భాగంగా ఇప్పటికే గతవారంలో 70వేల మంది పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించామన్నారు. కార్యక్రమం మరో వారం రోజులు కొనసాగుతుందన్నారు.

ఇంగ్లీషు -తెలుగు బుక్స్ ఇప్పటికే ప్రింటింగ్ పూర్తయ్యాయని, ప్రైవేటు స్కూళ్లకు వెళ్లి ఎలా పరిశీలిస్తున్నారో.. అదే విధంగా ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి పేరెంట్స్ చెక్ చేసుకోవాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో శానిటేషన్, వాటర్ తదితర ఏర్పాట్లు చూసుకోవాల్సిన బాధ్యత గ్రామ సర్పంచ్ పై ఉందన్నారు. మిషన్ భగీరథ వాటర్ ప్రతి స్కూళ్లల్లో ఉండాలని.. స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు ప్రతి స్కూళ్లను విజిట్ చేయాలని కోరుతున్నట్లు తెలిపారు.