కరోనా కేసులపై సీఎం ఉద్ధవ్ తుది హెచ్చరిక

ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం ముంబై నగరంలోని మార్కెటులో ప్రజలు ముక్కు కింద మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించక పోవడం, పెద్ద ఎత్తున జనం ఒకచోట గుమిగూడటాన్ని సీఎం ఠాక్రే తీవ్రంగా పరిగణించారు.ముంబై నగరంలో గత 24 గంటల్లో 1962 కరోనా కేసులు నమోదు అయినా సోమవారం ఉదయం దాదర్ మార్కెటులో భారీగా జనం గుమిగూడటంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదర్ మార్కెటులో ప్రజలు కొవిడ్ కనీస నిబంధనలు పాటించక పోవడంపై సీఎం తుది హెచ్చరిక జారీ చేశారు. నాగపూర్ నగరంలో మార్చి 15వతేదీ నుంచి మార్చి 21 వతేదీ వరకు కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ ప్రకటించారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే లాక్ డౌన్ విధించక తప్పదని సీఎం ఠాక్రే హెచ్చరించారు.కఠిన మైన లాక్ డౌన్ విధించే పరిస్థితిని ప్రజలు తీసుకురావద్దని సీఎం తుది హెచ్చరిక జారీ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/