జగపతి బాబు ను మోసం చేసిందెవరు..?

సినీ నటుడు జగపతి బాబు మోసపోయాడట..ఈ విషయం స్వయంగా ఆయనే తెలిపారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులను అలరించిన ఆయన..ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. అలాగే సోషల్ మీడియా లో ను యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను , నెటిజన్లను అలరిస్తూ వస్తున్న ..ఆయన తాజాగా సోషల్ మీడియా లో ఓ పోస్ట్ చేసి షాక్ ఇచ్చారు.

రియల్ ఎస్టేట్ రంగంలో జరిగే మోసాలకు తాను కూడా బాధితుడ్నయ్యానని, అభిమానులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. భూమి కొనేముందు రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) నిబంధనలు గురించి పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. ఇటీవల తాను ఒక రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వాణిజ్య ప్రకటనలో నటించానని, కానీ తనను మోసం చేశారని జగపతి బాబు ఆరోపించారు. అయితే, తనను మోసగించిన వాళ్లెవరు? అసలేం జరిగింది? అనే అంశాలను త్వరలోనే వెల్లడిస్తానని పేర్కొన్నారు. జగపతి బాబు ఈ విషయం తెలిపిన దగ్గరి నుండి ఎవరై ఉంటారని అంత మాట్లాడుకుంటున్నారు.