కేసీఆర్ పేరును ఈడీ ఎక్కడా పేర్కొనలేదు – కవిత లాయర్

ఢిల్లీ లిక్కర్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయినా సంగతి తెలిసిందే. గత కొద్దీ రోజులుగా ఆమె తీహార్ జైలు లో ఉంది..బెయిల్ కోసం ఎంతగానో ట్రై చేస్తున్నప్పటికీ కోర్ట్ మాత్రమే బెయిల్ ఇవ్వడం లేదు. ఇదే క్రమంలో ఈ కేసులో కవిత తండ్రి..బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పేరును ను కూడా ప్రస్తావించారనే వార్తలు వైరల్ గా మారడం తో ఆ వార్తలపై కవిత తరఫు న్యాయవాది మోహిత్ రావు క్లారిటీ ఇచ్చారు.

ఈడీ వాదనలలో కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చినట్లు మీడియా లో వస్తున్న ప్రచారం లో నిజం లేదన్నారు. ఈడీ ఎక్కడా కేసీఆర్ పేరును రాయలేదని క్లారిటీ ఇచ్చారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రస్తావన మాత్రమే ఈడీ చేసిందన్నారు. మాగుంట రాఘవ తన వాంగ్మూలంలో తన తండ్రి శ్రీనివాసులు రెడ్డికి మద్యం కేసులో ఉన్న వారిని పరిచయం చేశారని ఈడీ పేర్కొందన్నారు. అంతే తప్ప కేసీఆర్ పేరు కానీ , ఆయన ప్రస్తావన కానీ ఈడీ తీసుకురాలేదని..కొన్ని మీడియా సంస్థలు కావాలంటే కేసీఆర్ పేరు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.