సోనియాగాంధీతో సమవేశమైన రేవంత్‌రెడ్డి

revanth-reddy-meeting-with-sonia-gandhi

న్యూఢిల్లీః తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఈరోజు(మంగళవారం) మధ్యాహ్నం పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి అవతరణ వేడుకలకు ఆమెను ఆహ్వానించారు. దాదాపు అరగంటపాటు ఈ సమావేశం జరిగింది. అంతకుముందు, ముఖ్యమంత్రి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. ఆయననూ వేడుకలకు ఆహ్వానించారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తయినందున అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

కాగా, ప్రముఖ కవి అందెశ్రీ రచించిన తెలంగాణ అధికారిక గీతాన్ని సోనియా గాంధీ సమక్షంలో వేడుకల్లో ఆవిష్కరించనున్నట్లు సీఎం క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర గీతానికి కీరవాణి సంగీతం అందించారు.