మంత్రి కేటీఆర్ వరకు చేరిన తాండూరు వ్యవహారాం

కాసేపట్లో కేటీఆర్ తో భేటీ అయ్యే అవకాశం

హైదరాబాద్ : తెలంగాణలోని తాండూరు వ్యవహారాం మంత్రి కేటీఆర్ వరకు చేరింది. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.. మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. మహేందర్ రెడ్డి వ్యవహారాన్ని ఆయన కేటీఆర్ కు వివరించినట్టు తెలుస్తోంది. ఘటనపై కేటీఆర్ సీరియస్ అయినట్టు సమాచారం. అక్కడి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ వ్యవహారంపై అధిష్ఠానం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డినీ అధిష్ఠానం పిలిచినట్టు సమాచారం. మరి కాసేపట్లో ఆయన కూడా కేటీఆర్ తో సమావేశమయ్యే అవకాశం ఉంది.

ఓ గుడిలో కార్యక్రమానికి సంబంధించి రోహిత్ రెడ్డి, మహేందర్ రెడ్డిలు హాజరుకాగా.. తనను కాదని ఎమ్మెల్యే అనుచరులకు కార్పెట్ వేశారంటూ తాండూరు సీఐపై మహేందర్ రెడ్డి బూతు పురాణం అందుకున్నారంటూ ఓ ఆడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై మహేందర్ రెడ్డి స్పందిస్తూ, ఆ ఆడియో తనది కాదని అన్నారు. ఇసుక దందాలో రోహిత్ రెడ్డి, సీఐకి ప్రమేయం ఉందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/