బరువు తగ్గించే చిరు ధాన్యాలు

ఆహారం – ఆరోగ్యం

Weight loss with Cereals
Weight loss with Cereals

రాగుల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది.. హిమోగ్లోబిన్ తయారీకి అవసరమైన ఐరన్ రాగుల ద్వారా శరీరానికి అందుతుంది.. అంతేకాకుండా వీటిలో కాల్షియం , పొటాషియం అధికంగా ఉంటాయి.. ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణం కావటానికి ఎక్కువ సమయం పడుతుంది.. ఫలితంగా ఏకువ సమయం పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.. డయాబెటిస్ తో బాధ పడేవారికి ఇది మంచి ఆహారం. రాగులు పిల్లలకు పెడితే చాలా మంచిది.. ఇందులో ఉన్న అమైనోయాసిడ్స్ పిల్లల మెదడు పెరుగుదలకు సహాయపడతాయి.

జొన్నల్లో విటమిన్ బి:

మెగ్నీషియం, యాంటీ ఆక్సీడెంట్స్ , ఫ్లావ నాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్స్ , టిన్నిన్స్ ఉంటాయి. బి విటమిన్ జీవ క్రియల రేటును పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.. జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.. మెగ్నీషియం ఎముకలు, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.. 86 గ్లాసుల జొన్నలు తీసుకుంటే రోజూ తీసుకోవాల్సిన ఫైబర్ లో 20 శాతం శరీరానికి అందుతుంది.. ఫైబర్ పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది..

సజ్జలు:

తక్కువ క్యాలరీలు ఇస్తాయి.. ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్ , క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి.. బరువు తగ్గాలనుకునే వారు సజ్జలను తప్పకుండా మెనూలో చేర్చుకోవాలి.. వీటిలో ఉన్న ఫైబర్ ఎక్కువ సమయం పొట్టను నిండుగా ఉంచుతుంది. ఫలితంగా రోజూ తీసుకునే క్యాలరీల సంఖ్య పెరగదు.. సజ్జలను తీసుకోవటం వాళ్ళ డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.. కొలెస్ట్రాల్ ను నియంత్రించటంతో పాటు కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా కాపాడుతాయి.

‘నాడి ‘ (ఆరోగ్య విషయాలు) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/health1/