ఇంటి శుభ్రతతో వ్యాధులు పరార్‌

పరిసరాలు- పరిశుభ్రత

Home Cleaning
Home Cleaning

ప్రస్తుతం చాలా మంది ఇళ్లల్లోనే ఉంటున్నారు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే మనం కూడా అంతే ఆరోగ్యంగా ఉంటాం. ఇంటిని శుభ్రం చేయకపోతే వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.

ఇంటిని శుభ్రంగా ఉంచుకుని వ్యాధులకు దూరంగా ఉంటే మంచిది.

ఇంటిని శుభ్రపరిచేటప్పుడు చాలా మంది పెద్ద పనులపై దృష్టి పెడతారు. కంటికి కనిపించే ధూళిని శుభ్రం చేస్తాం.

కానీ మన ఇంట్లోనే చాలా ప్రాంతాలు ప్రమాదకరమైన బ్యాక్టీరియాకు నిలయమని గుర్తించం. తరచుగా కొన్ని వస్తువులను ఉపయోగిస్తాం. కానీ వాటిని శుభ్రం చేసే విషయాన్ని అంతగా పట్టించుకోము.

ఇంట్లో ఎక్కువా ఉపయోగించే వాటిలో రిమోట్‌ కంట్రోల్‌ ఒకటి. ఎయిర్‌ కండిషనర్‌, టివి లేదా మరే ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరమైనా దానికి రిమోట్‌ కంట్రోల్స్‌ తప్పకుండా ఉంటుంది.

అయితే మనలో చాలా మంది టివి, ఎయిర్‌ కండిషనర్‌లను శుభ్రం చేస్తాం కానీ వాటి రిమోట్‌లను శుభ్రం చేయం. వీటిని కూడా తప్పకుండా శుభ్రం చేయాలి.

ఎందుకంటే రిమోట్‌ అందరి చేతుల్లో ఉంటుంది. కనుక వాటిపై క్రిములు ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తాయి.

అందువల్ల వీటిని శుభ్రం చేయకపోవటం వల్ల రిమోట్‌ పై ఉండే క్రిములు అనేక అనారోగ్యాలను కలిగిస్తాయి.

వీటి వల్ల ప్రమాదకరమైన అనారోగ్యా సమస్యలు కూడా ఎదురు కావచ్చు. అందుకే రిమోట్‌ను కూడా తరచుగా శుభ్రం చేస్తుండాలి.

ప్రస్తుతం అందరి చేతుల్లో సెల్‌ ఫోన్లు ఉంటున్నాయి. ఉదయం లేచి దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం సెల్‌ఫోన్లతోనే రోజంతా గడిపేస్తాం. అయితే వాటి వల్ల అనేక అనారోగ్యాలు వస్తున్నాయి.

సెల్‌ఫోన్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు ఎన్నో అధ్యయనాలు, పరిశోధనలు నిరూపించాయి. అందువల్ల మన ఫోన్‌లను దాదాపు ప్రతిరోజు శుభ్రం చేయాలి.

లేదంటే వాటిపై ఉండే క్రిములు హాని కలిగిస్తాయి. మనలో చాలా మంది ఫోన్లను బాత్రూంలోకి కూడా తీసుకెళ్లడం, బాత్రూమ్‌ ఉపయోగించిన తర్వాత చేతులు కూడా ఫోన్లను పట్టుకుంటాం.

అందుకే మన ఫోన్లను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.

కొంత మంది రెగ్యులర్‌గా మేకప్‌ వేసుకుంటుంటారు. దాని కోసం మేకప్‌ బ్రష్‌లను ఉపయోగిస్తారు. అయితే మేకప్‌ బ్రష్‌లు చర్మవ్యాధుల బాక్టీరియాకు నిలయం.

అది మేకప్‌ అవశేషాల వల్ల అభివృద్ధి చెందుతుంది.

అందువల్ల క్రమం తప్పకుండా వాటిని శుభ్రపరచడం అవసరం. చర్మం ఆరోగ్యంగా ఉండటానికి వారానికి ఒకసారైన వాటిని శుభ్రం చేయాలి.

ఇంట్లో కిచెన్‌ శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి కిచెన్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా కిచెన్‌ సింక్‌ శుభ్రంగా ఉంచుకోవాలి.

ఎందుకంటే అందులో అనేక రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. సన్నని అవశేషాలు సింక్‌ నెట్‌లో మిగిలిపోతాయి.

సింక్‌ నెట్‌ తెరిచి, దానిని తలకిందులుగా చేస్తే చెత్త ఉంటుంది. అందుకే రోజు తప్పించి రోజు కిచెన్‌ సింక్‌ను శుభ్రపరచుకోవాలి.

దీని వల్ల ఆరోగ్యంగా ఉంటాము. ఇంట్లో చాలా వరకు అన్ని వస్తువులను స్పాంజ్‌తోనే శుభ్రం చేస్తాం. ధూళిని, వస్తువులను శుభ్రం చేయటానికి మనం స్పాంజ్‌ను ఉపయోగిస్తాం.

అందుకే స్పాంజ్‌ను శుభ్రంగా ఉంచాలి. లేకపోతే వాటివల్ల అనేక అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది.

స్పాంజ్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. లేకుంటే వాటిలో ఉండే ధూళి, అనేక క్రిములు అనాగారోగ్యాలకు దారి తీస్తాయి.

తడి స్పాంజ్‌ను ఉపయోగించే ప్రతిసారి దాన్ని ఒక నిమిషం పాటు మైక్రోవేవ్‌ చేసి, ఆపై సబ్బతో శుభ్రం చేసి పొడిగా ఉంచాలి.

ఇలా చేస్తే స్పాంజ్‌లో ఉండే బ్యాక్టీరియాను తొలగిపోతుంది. తలుపులపై కనిపించని బ్యాక్టీరియా ఉంటుంది. ఇంటికి ఎవరు వచ్చినా డోర్‌ గెడలను తప్పక తాకుతారు.

అందువల్ల అనేక ఇన్ఫెక్షన్లు వస్తాయి. డోర్‌ గెడలు తాకడం వల్ల వాటి మీద ఉన్న బ్యాక్టీరియా నిక్షేపాలు మన చేతి నుండి శరీరంలోకి చేరి అనేక అనారోగ్యాలకు కారణమవుతాయి.

కాబట్టి తలుపు గెడలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వాటిని వెనిగర్‌తో శుభ్రపరచాలి. అప్పుడే వాటిపై ఉన్న క్రిములు నశిస్తాయి.

ఇంటిని శుభ్రం చేసేటప్పుడు కనిపించే ధూళినే కాక ఇలా చిన్న చిన్న వస్తువులను కూడా శుభ్రం చేసుకోవాలి.

వీటి వల్లనే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఇలాంటి వస్తువులను తప్పక శుభ్రం చేసుకోవాలి. ఈ సారి ఇల్లు శుభ్రం చేసేటప్పుడు వీటిని మాత్రం మరిచిపోవద్దు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/