సిఎం జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

chandrababu-and-pawan-kalyan-wishes-cm-jagan-on-his-birthday

అమరావతిః సిఎం జగన్‌ నేడు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ఆర్‌సిపి శ్రేణుల్లో పండగ వాతావరణం కనిపిస్తోంది. వైఎస్‌ఆర్‌సిపి నేతలు, కార్యకర్తలు ప్రతి ఊళ్లోనూ కేక్ లు కట్ చేస్తూ జగన్ పై తమ అభిమానం చాటుకుంటున్నారు.

కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు విపక్ష టిడిపి నేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. “బర్త్ డే గ్రీటింగ్స్ టు వైఎస్ జగన్” అంటూ చంద్రబాబు విషెస్ తెలిపారు. అటు, పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేశారు. “ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అంటూ తన ప్రకటనలో పేర్కొన్నారు. “ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను” అని తెలిపారు.

ఇక, క్యాంపు కార్యాలయంలో సీఎం బర్త్ డే కోలాహలం నెలకొంది. అక్కడ జరిగిన వేడుకల్లో సీఎం జగన్ తో మంత్రులు, అధికారులు కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి, రోజా, తానేటి వనిత, విడదల రజని, జోగి రమేశ్, రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి తదితరులు సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు కేక్ తినిపించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/